పార్లమెంటు పనితీరును రాజకీయం చేస్తున్నారు: సోనియాకు కేంద్ర మంత్రి కౌంటర్‌

ఇతర పార్టీలను సంప్రదించకుండానే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను (Parliament Session) ఏర్పాటు చేస్తున్నారని కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ (Sonia Gandhi) ప్రధానమంత్రికి లేఖ రాయడాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి తప్పుపట్టారు.

Published : 06 Sep 2023 19:28 IST

దిల్లీ: అజెండా ప్రకటించకుండా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను (Parliament Session) ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నిస్తూ కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ (Sonia Gandhi) ప్రధానమంత్రికి లేఖ రాయడాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తప్పుపట్టారు. పార్లమెంటు పనితీరును రాజకీయం చేయడంతో పాటు అనవసర వివాదాన్ని సృష్టిస్తున్నారని సోనియా గాంధీపై విమర్శలు గుప్పించారు.

‘ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు, కార్యకలాపాలను రాజకీయం చేయడం, వివాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నం చేయడం దురదృష్టకరం’ అని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి పేర్కొన్నారు. ఎలాంటి అజెండాను ప్రకటించకుండా పార్లమెంటును ప్రత్యేకంగా ప్రభుత్వం సమావేశపరుస్తోందని సోనియా గాంధీ పేర్కొనడంపై మండిపడ్డారు.

India Or Bharat: ఇండియా స్థానంలో భారత్‌!

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల (special Parliament session) అజెండా ఏంటో బయటపెట్టాలని.. ఇతర రాజకీయ పార్టీలను సంప్రదించకుండానే వీటిని నిర్వహించేందుకు సిద్ధమవడాన్ని ప్రశ్నిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సోనియా గాంధీ బుధవారం లేఖ రాశారు. ఐదు రోజులూ ప్రభుత్వ అజెండాకే కేటాయించినట్లు తెలిసిందన్న ఆమె.. ఈ అజెండాలో తాము చెప్పిన 9 అంశాలను చేర్చాలని అందులో పేర్కొన్నారు. అదానీ అక్రమాలు, మణిపుర్‌ అల్లర్లు, రైతు సమస్యలు, కనీస మద్దతు ధర విషయంలో ఇచ్చిన హామీ, కులాల వారీగా జనగణన, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దిగజారుతున్న సంబంధాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను ఆదుకోవడం, హరియాణా సహా పలు రాష్ట్రాల్లో ఘర్షణలు, సరిహద్దుల్లో చైనా ఆక్రమణలపై ఈ సమావేశాల్లో చర్చ చేపట్టాలని ప్రధాని మోదీ (PM Modi)ని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని