యాపిల్‌ కొత్త పాలసీ..అలాంటి యాప్‌లకు చెక్‌! 

గోప్యత విధానం..ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే మాట. ఇన్‌స్టా మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ కొత్త పాలసీ ప్రకటనతో దీనిపై ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో యాపిల్ కంపెనీ కూడా త్వరలో గోప్యత పర్యవేక్షణకు సంబంధించి కొత్త ఫీచర్‌ను తీసుకురానుందట.... 

Published : 29 Jan 2021 23:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గోప్యత విధానం.. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే మాట. ఇన్‌స్టా మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ కొత్త పాలసీ ప్రకటనతో దీనిపై ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో యాపిల్ కంపెనీ కూడా త్వరలో గోప్యత పర్యవేక్షణకు సంబంధించి కొత్త ఫీచర్‌ను తీసుకురానుందట. ఈ మేరకు కంపెనీ వ్యవహారాలతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారని అంతర్జాతీయ టెక్‌ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. కొత్త విధానం ప్రకారం ఇక మీదట ప్లేస్టోర్‌లోని యాప్స్‌ డెవలపర్లు‌ యూజర్‌ డేటా ట్రాకింగ్ చేయాలంటే యాప్‌ ఇన్‌స్టాల్ చేసుకునే సమయంలో యూజర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం ఫేస్‌బుక్‌ సహా డిజిటల్‌ సేవలకు సంబంధించిన ఇతర కంపెనీలు యూజర్‌ డేటా ఆధారంగా ప్రకటనలు ఇస్తున్నాయి. అయితే యాపిల్ మాత్రం యూజర్‌ భద్రత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేసింది. అలానే ప్రకటనకర్తలకు ఆదాయం వచ్చేలా సరికొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త గోప్యత విధానాన్ని ఐఓఎస్‌ అప్‌డేట్‌లో భాగంగా మార్చి లేదా ఏప్రిల్ నెలలో తీసుకొస్తారని సమాచారం.   

ప్రస్తుతం ఐఫోన్లలో ఉపయోగించే యాప్స్‌ చాలావరకు యూజర్ డేటాను ట్రాక్‌ చేస్తున్నాయట. అయితే యాపిల్ కొత్త విధానాన్ని ఫేస్‌బుక్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయం వల్ల తాము ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉందని ఫేస్‌బుక్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఇంటర్నెట్‌లో అతి పెద్ద యాడ్ నెట్‌వర్క్‌ కలిగిన గూగుల్ మౌనంగా ఉండటం గమనార్హం. అయితే యాపిల్ కొత్త పర్యవేక్షణ విధానం డిజిటల్ నెట్‌వర్క్‌లలో ఐఫోన్ ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభావం చూపుతుందని గూగుల్‌ అభిప్రాయపడింది. అలానే యూజర్‌ గోప్యతకు భంగం కలగకుండా ప్రకటనల ద్వారా సమాచారాన్ని అందించే విధానానికి కట్టుబడి ఉన్నామని గూగుల్ తెలిపింది. యాపిల్ కూడా యూజర్‌ గురించి యాప్స్‌ ఎంతమేర తెలుసకోవాలనే దానికి సంబంధించి 11 పేజీల ప్రకటన విడుదల చేసింది.  

ఇవీ చదవండి..  

గాల్లోనే ఫోన్‌ ఛార్జింగ్..సాధ్యమేనా? 

భారత్‌లో తగ్గనున్న ఐఫోన్ ధరలు..

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts