కంటతడి పెట్టించిన రాకింగ్ రాకేశ్‌

‘జబర్దస్త్‌’ కేవలం నవ్వించడమే కాదు... మనుషుల మనసులు మారేలా భావోద్వేగమైన స్కిట్లు కూడా వేస్తుంటారు. అందులో సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న

Published : 29 Nov 2020 01:13 IST

హైదరాబాద్‌: ‘జబర్దస్త్‌’ కేవలం నవ్వించడమే కాదు... మనుషుల మనసులు మారేలా భావోద్వేగమైన స్కిట్లు కూడా వేస్తుంటారు. అందులో సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంటారు. నవ్వుతూ, నవ్విస్తూ.. ఆఖరున ఇచ్చే సందేశం ఆలోచింపజేయకుండా ఎందుకు ఉంటుంది. వచ్చేవారం ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’లో కూడా ఇలాంటి ఓ స్కిట్‌ రాబోతోంది. పిల్లలతో స్కిట్లు వేస్తూ నవ్వించే రాకేశ్‌... ఈసారి పంటలతో స్కిట్‌ వేశాడు. చేతికొచ్చిన పంట, అకాల వర్షం కారణంగా నష్టపోతే ఆ రైతు పడే ఆవేదనను చూపించాడు. ఇది చూసి షోలో జడ్జిలు కళ్లలో నీళ్లు తిరిగాయి. 

చాలా రోజుల తర్వాత రష్మీ - సుధీర్‌ కలసి ఓ స్కిట్‌ వేయబోతున్నారు. ‘మగధీర’కు స్పూఫ్‌గా ఈ స్కిట్‌ ఉండబోతోంది. ఇందులో సుధీర్‌ ‘ఖాళీ బీరువా’ (కాలభైరవకు స్పూఫ్‌)గా కనిపించబోతున్నాడు. రష్మి ఇత్తడి బిందె (మిత్రవిందకు స్పూఫ్‌)గా కనిపించబోతోంది. మరి గెటప్‌ శ్రీను, ఆటో రాం ప్రసాద్‌ ఎలా కనిపిస్తారనేది ప్రోమో చూస్తే తెలుస్తుంది. రష్మీ - సుధీర్‌ ఓ పాటకు డ్యాన్స్‌ వేశారు కూడా. జీవన్‌ స్కిట్‌లో భాగంగా రిత్విక పంచులతో కడుపుబ్బా నవ్వించింది. బుల్లెట్‌ భాస్కర్‌, కెవ్వు కార్తీక్‌ స్కిట్లు ఆకట్టుకోనున్నాయి. ఈ నవ్వుల వినోదాన్ని ఆస్వాదించేందుకు వచ్చే శుక్రవారం (డిసెంబర్‌ 4)న ప్రసారం కానున్న ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ చూడాల్సిందే..! కాసేపు నవ్వుకోవాలంటే ప్రోమో చూడాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని