ఫ్యాషన్‌ ప్రియుల్ని ఆకట్టుకున్న కాజల్‌ డ్రెస్‌

తన ప్రియసఖుడు గౌతమ్‌ కిచ్లుతో ఏడడుగులు వేసి శ్రీమతిగా మారారు అగ్రకథానాయిక కాజల్‌ అగర్వాల్‌. అక్టోబర్‌ 30న వీరి వివాహం అతి తక్కువమంది బంధువుల సమక్షంలో ముంబయిలోని ఓ హోటల్‌లో వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. అయితే వివాహం తర్వాత ఈ జంట హనీమూన్‌ కోసం మాల్దీవులకు...

Updated : 22 Nov 2020 09:46 IST

ధరెంతో తెలుసా?

హైదరాబాద్‌: తన ప్రియసఖుడు గౌతమ్‌ కిచ్లుతో ఏడడుగులు వేసి శ్రీమతిగా మారారు అగ్రకథానాయిక కాజల్‌ అగర్వాల్‌. అక్టోబర్‌ 30న వీరి వివాహం ముంబయిలోని ఓ హోటల్‌లో వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ జంట హనీమూన్‌ కోసం మాల్దీవులకు వెళ్లి వచ్చింది. వెకేషన్‌లో భాగంగా భర్తతో దిగిన పలు ఫొటోలు, వీడియోలను ఆమె ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

కాగా, టూర్‌కు సంబంధించి మొదటిరోజు ఆమె షేర్‌ చేసిన పలు ఫొటోలు నెటిజన్లను ఎంతో ఆకట్టుకున్నాయి. కాజల్‌ ధరించిన రెడ్‌ డ్రెస్‌ ఫ్యాషన్‌ ప్రియుల్ని ఎంతగానో ఆకర్షించింది. దీంతో ఆ డ్రెస్‌ ధర గురించి తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి కనబరిచారు. ఆ రెడ్‌ డ్రెస్‌ ధర రూ.13 వేలు అని పలు ఫ్యాషన్‌ వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి.

చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ సినిమాలో కాజల్‌ కథానాయికగా కనిపించనున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ సెట్‌లోకి ఆమె త్వరలో అడుగుపెట్టనున్నారు. మరోవైపు కమల్‌హాసన్‌-శంకర్‌ కాంబినేషన్‌లో రానున్న ‘భారతీయుడు-2’ చిత్రంలో కాజల్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని