సింగర్‌ మనో కన్నీటి పర్యంతం

విజయదశమి వేడుకల్లో గాయకుడు మనో కన్నీటి పర్యంతమయ్యారు. పాటపాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికిలోనయ్యారు.  అది చూసిన పలువురు తారలు ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మాత్రం ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది...

Updated : 23 Oct 2020 16:49 IST

ఆయన భావోద్వేగానికి కారణమేమిటంటే

హైదరాబాద్‌: విజయదశమి వేడుకల్లో గాయకుడు మనో కన్నీటి పర్యంతమయ్యారు. పాటపాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికిగురయ్యారు.  అది చూసిన పలువురు తారలు ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మాత్రం ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఈటీవీలో ‘అక్కా ఎవరే అతగాడు?’ అనే ప్రత్యేక కార్యక్రమం ప్రసారం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్‌ జరుపుకొన్న ఈ ప్రోగ్రామ్‌ ప్రోమోలు ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. సంగీత, నవదీప్‌, సుధీర్‌ పంచులతో మొదటి ప్రోమో నవ్వులు పూయించగా.. రఘు కుంచె పెర్ఫామెన్స్‌తో రెండో ప్రోమో హుషారెత్తించింది. మరణించిన తెలుగు హాస్యనటులపై మూడో ప్రోమోలో చేసిన స్కిట్‌ చూసి ప్రోగ్రామ్‌లో పాల్గొన్న వారే కాకుండా ప్రేక్షకులు సైతం కన్నీరు పెట్టుకున్నారు. తాజాగా ఈవెంట్‌కు సంబంధించిన సరికొత్త ప్రోమో విడుదలయ్యింది.

కాగా, ఈవెంట్‌లో భాగంగా సుధీర్‌.. ‘భీష్మ’ చిత్రంలోని ఓ పాటకు స్టెప్పులేయగా.. సింగర్‌ మంగ్లీ జానపద గీతాలు పాడి స్టేజ్‌పై సందడి చేసినట్లు తాజా ప్రోమోలో చూడొచ్చు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన గాయకుడు ఎస్పీ బాలుకి నివాళులర్పిస్తూ మనో, ఉష ‘సూర్యుడే సెలవని’ పాటను ఆలపించారు. పాట పాడుతున్న సమయంలో మనో తీవ్ర భావోద్వేగానికి గురై స్టేజ్‌పైనే కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే ఈవెంట్‌లో ఉన్న పలువురు సెలబ్రిటీలు, ఇతర బృందం ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. అనంతరం ఆయన బాలు గురించి మాట్లాడుతూ..‘బాల సుబ్రహ్మణ్యం గారిని చూస్తూ పెరిగాను. అందర్నీ సమానంగా చూసే గొప్ప వ్యక్తి. ఈరోజు ఆయన మన మధ్య లేరంటే నిజంగా తట్టుకోలేకపోతున్నాను’ అని అన్నారు. ఆదివారం(అక్టోబర్‌ 25) ఉదయం 9 గంటలకు ఈటీవీలో ప్రసారం కానున్న ‘అక్కా ఎవరే అతగాడు?’ సరికొత్త ప్రోమో చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని