పోరాటంతో ప్రారంభం

చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రం పట్టాలెక్కింది. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్లో శుక్రవారం నుంచి చిత్రీకరణ ప్రారంభించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా సెట్లో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు దర్శకుడు మోహన్‌ రాజా. ‘‘నా తల్లిదండ్రులు స్నేహితులు, శ్రేయోభిలాషుల ఆశీస్సులతో మరో ప్రయాణం మొదలైంది....

Updated : 14 Aug 2021 06:53 IST

చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రం పట్టాలెక్కింది. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్లో శుక్రవారం నుంచి చిత్రీకరణ ప్రారంభించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా సెట్లో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు దర్శకుడు మోహన్‌ రాజా. ‘‘నా తల్లిదండ్రులు స్నేహితులు, శ్రేయోభిలాషుల ఆశీస్సులతో మరో ప్రయాణం మొదలైంది. మెగా మూవీ కోసం ఓ అద్భుతమైన బృందంతో కలిసి పని చేస్తున్నాం’’ అని ఆ ఫొటోకి ఓ వ్యాఖ్యని జత చేశారు. ప్రస్తుతం ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో షూట్‌ మొదలు పెట్టినట్లు తెలిసింది. దీనికి స్టంట్‌ మాస్టర్‌ సిల్వ నేతృత్వం వహిస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘లూసీఫర్‌’కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రమిది. కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌, ఎన్వీఆర్‌ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘గాడ్‌ ఫాదర్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. దీనికి తమన్‌ స్వరాలందిస్తుండగా.. నిరవ్‌ షా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు