‘మా’ ఎన్నికలు అక్టోబరు 10న

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) కార్యవర్గ ఎన్నికల తేదీ ఖరారైంది. అక్టోబరు 10న ఎన్నికల్ని నిర్వహించనున్నట్టు ‘మా’ అధ్యక్షుడు వి.కె.నరేష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల జరిగిన సర్వసభ్యసమావేశం

Updated : 26 Aug 2021 08:08 IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) కార్యవర్గ ఎన్నికల తేదీ ఖరారైంది. అక్టోబరు 10న ఎన్నికల్ని నిర్వహించనున్నట్టు ‘మా’ అధ్యక్షుడు వి.కె.నరేష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల జరిగిన సర్వసభ్యసమావేశం అనంతరం మా క్రమశిక్షణ కమిటీ ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు మా అధ్యక్షుడు ఎన్నికల నిర్వహణ తేదీ విషయాన్ని ప్రకటించారు. 2021 - 23 కాలానికిగానూ జరగనున్న కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పలువురు నటులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే  ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమ, సీవీఎల్‌ నరసింహారావు తాము పోటీ చేస్తున్న విషయాన్ని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని