Ira Khan: స్టార్‌ కిడ్‌ హోదా.. మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపింది: ఐరా ఖాన్‌

స్టార్‌ కిడ్‌ హోదా తన మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో చెప్పారు ఐరా ఖాన్‌ (Ira Khan). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మెంటల్‌ హెల్త్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 12 Jul 2023 16:38 IST

ముంబయి: స్టార్‌ కిడ్‌ హోదా తన మానసిక ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపించిందని బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) కుమార్తె ఐరా (IRA Khan) అన్నారు. ఆ హోదా వల్ల ఉపయోగం ఎంత ఉందో అదే విధంగా ఇబ్బందులు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐరా.. డిప్రెషన్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అగస్తు ఫౌండేషన్‌ ప్రారంభించడానికి గల కారణాన్ని వెల్లడించారు.         

‘‘మానసిక కుంగుబాటుకు ఒక కారణం అంటూ ఏమీ ఉండదు. చుట్టూ ఉండే పరిసరాలే మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. స్టార్‌ కుటుంబంలో పెరగడం నా మానసిక స్థితిని ప్రభావితం చేయలేదని చెప్పడం పిచ్చితనం అవుతుంది. ఇలాంటి కుటుంబంలో భాగం కావడం వల్ల నా మానసిక ఆరోగ్యం ఎంతో దెబ్బతింది. స్టార్‌ కిడ్‌గా ఉండటం కొన్నిసార్లు మనకు ఉపయోగపడొచ్చు. అలాగే, కొన్నిసార్లు దాని వల్ల మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఒకానొక సమయంలో మానసిక ఒత్తిడి, భయం నన్నెంతో వేధించాయి. ఏడాదిలో కొన్నిసార్లు కుంగుబాటుకు లోనయ్యేదాన్ని. మళ్లీ సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పట్టేది. నాలాగే కుంగుబాటుతో ఇబ్బందిపడుతోన్న వారి కోసం అగస్తు అనే ఫౌండేషన్‌ను 2021లో మొదలుపెట్టా. దాదాపు ఏడాదిన్నర పాటు ఏమీ చేయలేదు’’ అని ఆమె వివరించారు.

ఇక, ఐరా త్వరలో తన ప్రియుడి నుపుర్‌ను వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఆమిర్‌ ఫిటెనెస్‌ ట్రైనర్‌గా నుపుర్‌ వర్క్‌ చేశారు. కరోనా సమయంలో ఐరాకూ ట్రైనర్‌గా పనిచేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని