Tamannaah: తమన్నా లేటెస్ట్ హిట్‌ సాంగ్‌.. వైరల్‌గా మారిన ‘AI’ వీడియోలు

జనరేటివ్ ఏఐ(కృత్రిమ మేధ) సహాయంతో సృష్టిస్తోన్న చిత్రాలు, వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తమన్నా (Tamannaah) లేటెస్ట్‌ హుక్‌ స్టెప్పులకు వేరే హీరోయిన్స్‌ డ్యాన్స్‌ చేస్తే ఎలా ఉంటుందో తెలియజేస్తూ వీడియోలు క్రియేట్‌ చేశారు.

Updated : 12 Jul 2023 13:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘‘వా.. నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి’’.. ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోన్న పాటల్లో ఇది కూడా ఒకటి. రజనీకాంత్‌ నటిస్తోన్న ‘జైలర్‌’ (Jailer) సినిమాలో తమన్నా చేసిన ఈ స్పెషల్‌ సాంగ్‌ ఇప్పుడు యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. మరీ ముఖ్యంగా ఈ పాటలో తమన్నా వేసిన హుక్‌ స్టెప్ యువతను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే  హుక్‌ స్టెప్పులకు వీడియోలు క్రియేట్‌ చేయాలంటూ.. ఇటీవల తమన్నా ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు డ్యాన్సర్లతో కలిసి ఆమె చేసిన డ్యాన్స్‌ వీడియో అంతటా వైరల్‌గా మారింది.

కాగా, ఇప్పుడిదే హుక్‌ స్టెప్పులకు జనరేటివ్ ఏఐ (కృత్రిమ మేధ) ఉపయోగించి వీడియోలు క్రియేట్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే సీనియర్‌ హీరోయిన్‌ సిమ్రాన్‌, నటి కాజల్‌ అగర్వాల్‌ ‘కావాలయ్యా’ పాటకు డ్యాన్స్‌ చేస్తున్నట్లు క్రియేట్‌ చేసిన పలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. వీటిని చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. వినూత్న ఆలోచన అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

‘అన్నాత్తె’ తర్వాత రజనీకాంత్‌ నటిస్తోన్న చిత్రమిది. నెల్సన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌ లాల్‌, జాకీ ష్రాఫ్‌, శివరాజ్‌కుమార్‌, సునీల్‌, రమ్యకృష్ణ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. ఇందులో భాగంగా గత వారం ఫస్ట్‌సాంగ్‌గా ‘కావాలయ్యా’ పాటను విడుదల చేశారు. ఇప్పటివరకూ దీనిని 2 కోట్ల మందికి పైగా వీక్షించారు.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని