Ira Khan: కుమార్తె వివాహం.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్‌హీరో

ఐరా ఖాన్‌ (Ira Khan) - నుపుర్‌ శిఖరే వివాహం వేడుకగా జరిగింది. ఉదయ్‌పుర్‌ వేదికగా జరిగిన ఈ పెళ్లి వేడుక ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Published : 11 Jan 2024 15:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ స్టార్‌హీరో ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) కుమార్తె ఐరా ఖాన్‌ (Ira Khan) వివాహం వేడుకగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ వేదికగా బుధవారం సాయంత్రం క్రైస్తవ సంప్రదాయంలో ఐరా - నుపుర్‌ శిఖరే ఒక్కటయ్యారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి వేడుక ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కుమార్తె పెళ్లి చూసి ఆమిర్‌ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు.

Nayanthara: నయన్‌ చిత్రానికి చిక్కులు.. ఓటీటీ స్ట్రీమింగ్‌ నుంచి తొలగింపు

ఆమిర్‌ ఖాన్‌ - రీనా దత్తా కూతురుగా ఐరా ఖాన్‌ సినీ ప్రియులకు సుపరిచితమే. మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఐరా తరచూ పోస్టులు పెడుతుంటారు. ఆమిర్‌ ఖాన్‌కు నుపుర్‌ శిఖరే వ్యక్తిగత ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా ఉన్నారు. కరోనా సమయంలో ఐరా కూడా నుపుర్‌ వద్ద ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్చుకున్నారు. ఈ పరిచయం వారి మధ్య ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో జనవరి 3న రిజిస్టర్‌ వివాహం చేసుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని