Nayanthara: నయన్‌ చిత్రానికి చిక్కులు.. ఓటీటీ స్ట్రీమింగ్‌ నుంచి తొలగింపు

నయనతార (Nayanthara) కొత్త చిత్రానికి ఇబ్బందులు తప్పడం లేదు. చిత్ర నిర్మాణ సంస్థ ఓటీటీ స్ట్రీమింగ్ నుంచి తొలగించేసింది.

Updated : 11 Jan 2024 16:33 IST

ఇంటర్నెట్‌డెస్క్: నటి నయనతార (Nayanthara)కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘అన్నపూరణి’ (Annapoorani)పై తలెత్తిన వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని చిత్ర నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఓటీటీ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచి దీనిని తొలగించేసింది. ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటంటే..

Nayanthara: విఘ్నేశ్‌ నన్నెప్పుడూ ప్రశ్నించలేదు.. నయనతార ఎమోషనల్‌ స్పీచ్‌

నయనతార 75వ చిత్రంగా ‘అన్నపూరణి’ విడుదలైంది. ‘ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. నీలేష్‌ కృష్ణ దర్శకుడు. సత్యరాజ్‌, జై కీలక పాత్రలు పోషించారు. సంప్రదాయ కుటుంబంలో జన్మించిన అమ్మాయి.. చెఫ్‌గా ఎదగాలనే తన కలను ఎలా సాకారం చేసుకుంది? అనే కథాంశంతో దీనిని రూపొందించారు. థియేటర్లలో మిశ్రమ స్పందనలు సొంతం చేసుకొంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాగా.. ఇందులోని కొన్ని సన్నివేశాలు మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నయనతారతోపాటు చిత్రబృందంపై ముంబయి, మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాణ సంస్థ ఓటీటీ స్ట్రీమింగ్‌ నుంచి తొలగించింది. మత విశ్వాసాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని వివరణ ఇచ్చింది. తమ సినిమా ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించమని కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని