Aamir Khan: జనవరి 3న.. నేను కచ్చితంగా ఏడుస్తా: ఆమిర్‌ఖాన్‌

నటుడు ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కుమార్తె వివాహం గురించి మాట్లాడారు.

Updated : 11 Oct 2023 18:28 IST

ముంబయి: ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) కుమార్తె ఐరా ఖాన్‌ (Ira Khan).. ఆయన వ్యక్తిగత ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ (Nupur) ఎంతోకాలం నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. గతేడాది వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలోనే ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టనుందంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తన కుమార్తె వివాహం గురించి తాజాగా ఆమిర్‌ స్పందించారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఐరా-నుపుర్‌ పెళ్లి వేడుకలు జరగనున్నాయని తెలిపారు.

‘‘జనవరి 3న ఐరా - నుపుర్‌ల పెళ్లి చేయాలని మేము నిశ్చయించాం. నుపుర్‌ మంచి అబ్బాయి. ఐరా గతంలో మానసిక కుంగుబాటుతో పోరాడిన విషయం తెలిసిందే. అప్పుడు తనకి అతడే అండగా నిలిచాడు. వాళ్లు సంతోషంగా ఉన్నందుకు నేనెంతో ఆనందిస్తున్నా. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది. వాళ్ల మనసులు దగ్గరయ్యాయి. వాళ్ల పెళ్లి నాడు నేనెంతో భావోద్వేగానికి గురవుతా. ఆరోజు నేను కచ్చితంగా ఏడ్చేస్తా. ఈ విషయంపై ఇప్పటికే నా కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్నారు. ‘ఆరోజు ఆమిర్‌ఖాన్‌ను ఎవరైనా జాగ్రత్తగా చూసుకోండి’ అని వాళ్లు చెబుతున్నారు. ఎందుకంటే నేనొక ఎమోషనల్‌ పర్సన్‌. ఆనందం, బాధ ఏది వచ్చినా కంట్రోల్‌ చేసుకోలేను’’ అని ఆయన చెప్పారు.

Samantha: సమంత శరీరంపై ‘చై’ టాటూ.. మిస్సింగ్‌ అంటూ నెటిజన్లు పోస్టులు

ఆమిర్‌ఖాన్‌ - ఆయన మొదటి భార్య రీనా దత్‌లకు ఐరా జన్మించారు. పరస్పర అంగీకారంతో తల్లీదండ్రులిద్దరూ విడిపోయిన తర్వాత ఐరా మానసిక కుంగుబాటుకు గురయ్యారు. కరోనా సమయంలో ఆమిర్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌తో ఐరాకు పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకు అది ప్రేమగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని