Samantha: సమంత శరీరంపై ‘చై’ టాటూ.. మిస్సింగ్‌ అంటూ నెటిజన్లు పోస్టులు

నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. నాగచైతన్య - సామ్‌ తిరిగి కలవనున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చిన తరుణంలో ఆమె ఓ టాటూని తొలగించినట్లు కథనాలు ప్రచురితమయ్యాయి.

Updated : 11 Oct 2023 16:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం దుబాయ్‌ వెకేషన్‌ను ఎంజాయ్‌ చేస్తోన్న సమంత (Samantha)కు సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. తన మాజీ భర్త, నటుడు నాగ చైతన్య (Naga Chaitanya) కోసం వేయించుకున్న పచ్చబొట్టును ఆమె తొలగించుకున్నారని పలువురు మాట్లాడుతున్నారు. అసలేం జరిగిందంటే.. పింక్‌ కలర్‌ చీరను ధరించి సమంత ఇటీవల ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను తాజాగా నెట్టింట షేర్‌ చేశారు. గతంలో ఆమె నడుముపై ‘చై’ అని వేయించుకున్న టాటూ ఈ ఫొటోల్లో కనిపించలేదు. దీనిని చూసిన నెటిజన్లు.. ‘‘పచ్చబొట్టు తొలగించుకున్నారా?’’, ‘‘పచ్చబొట్టును తొలగించడం కష్టం. కాబట్టి, మేకప్‌ వేసి టాటూను కవర్‌ చేసినట్లు ఉన్నారు’’ అని కామెంట్స్‌ చేస్తున్నారు.

నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడిన సమయంలో తమ ప్రేమకు గుర్తుగా సామ్‌ తన శరీరంపై మూడు పచ్చబొట్లు వేయించుకున్నారు. అందులో ఒకటి చేతి మణికట్టు వద్ద, మరొకటి మెడ వెనుక, మూడోది నడుము దగ్గర. ముఖ్యంగా నడుముపై ‘చై’ పేరుని రాయించుకున్నారు. సామ్‌-చై విడిపోయిన అనంతరం.. వాటిని ఆమె అలాగే ఉంచుకుంటారా? లేదా తీయించేస్తారా? ఏమైనా మార్పులు చేయించుకుంటారా? అని అభిమానులు మాట్లాడుకున్నారు. వీరిద్దరూ తిరిగి కలవనున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చిన తరుణంలో ‘చై’ టాటూ కనిపించకపోవడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Vyjayanthi Movies: ఆ సినిమాపై పూర్తి హక్కు మాకే ఉంది : వైజయంతి మూవీస్‌

జుకల్కర్‌కు సమంత గిఫ్ట్‌..!

సెలబ్రిటీ స్టైలిష్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌ (Preetham Jukalkar)కు నటి సమంత (Samantha) ప్రత్యేక కానుక అందించారు. ఆమె ఇచ్చిన గిఫ్ట్‌ పట్ల జుకల్కర్‌ ఆనందం వ్యక్తం చేశారు. సామ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ తాజాగా ట్వీట్‌ చేశారు. ఇంతకీ అతనికి సామ్‌ ఇచ్చిన గిఫ్ట్‌ ఏమిటంటే..?

జ్యుయెలరీ షోరూమ్‌ ప్రారంభోత్సవంలో భాగంగా తన టీమ్‌తో కలిసి సమంత ఇటీవల దుబాయ్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత స్టైలిష్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌కు ఆమె కానుక అందించారు. ఆయనకెంతో ఇష్టమైన స్టడ్స్‌, చెవి రింగులను బహుమతిగా అందించారు. వాటిని ధరించిన జుకల్కర్‌.. సామ్‌కు థ్యాంక్యూ చెబుతూ తాజాగా పోస్ట్‌ పెట్టారు. ‘‘ఓ మై గాడ్‌.. నేనీలా స్టడ్స్‌ ధరిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నాకు చెవులు కుట్టించినందుకు థ్యాంక్యూ సమంత దీదీ. మీరిచ్చిన స్టడ్స్‌, చెవి రింగులు నాకెంతో నచ్చాయి. ధైర్యంగా నిలబడి.. నాకెంతో సపోర్ట్‌ చేస్తున్న మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు’’ అని ఆయన రాసుకొచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని