Akshay Kumar: జాక్వెలిన్ కాదు.. కృతి నా ఫేవరెట్!
ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్ తన సినిమాల ప్రచారాన్ని విభిన్నంగా చేస్తుంటారు. హోలీ కానుకగా ఈ నెల 18న విడుదల కానున్న ‘బచ్చన్ పాండే’ను కూడా తనదైన శైలిలో ప్రేక్షకులకు చేరువ చేస్తున్నారు. ఆ చిత్రంలో అక్షయ్ సరసన
ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్ తన సినిమాల ప్రచారాన్ని విభిన్నంగా చేస్తుంటారు. హోలీ కానుకగా ఈ నెల 18న విడుదల కానున్న ‘బచ్చన్ పాండే’ను కూడా తనదైన శైలిలో ప్రేక్షకులకు చేరువ చేస్తున్నారు. ఆ చిత్రంలో అక్షయ్ సరసన కృతిసనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలుగా నటించారు. అర్షద్ వార్సీ కీలక పాత్రలో నటించారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా చిత్రబృందం రైలులో ముంబయి నుంచి దిల్లీకి వెళ్లింది. ఆ సమయంలో తీసిన ఓ సరదా వీడియోను ఆన్లైన్లో అభిమానులతో పంచుకున్నారు అక్షయ్. నిద్రపోయినట్లు నటిస్తున్న ఆయన్ను సహచరులు లేపి ‘మీకు ఇష్టమైన నటి ఎవరు?’ అని అడుగుతారు. ‘జాక్వెలిన్ ఫెర్నాండెజ్’ అని బదులిచ్చిన అక్షయ్‌ను ఆమె పేరుకు స్పెల్లింగ్ చెప్పమని కోరుతారు. అయితే అక్షయ్ స్పెల్లింగ్ చెప్పలేక తన సమాధానం జాక్వెలిన్ కాదు.. కృతిసనన్ అని చెప్పి మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. నేనేమైనా తప్పు చెప్పానా అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు అక్షయ్. ఫర్హాద్ సామ్జీ తెరకెక్కించిన ఈ చిత్రంలో అక్షయ్ విభిన్న గెటప్‌లో కనిపించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్‌నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు