Aliabhatt: ఆలియా.. ‘డార్లింగ్స్’
‘గంగూభాయి కాఠియావాడి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో ఉత్తరాదితో పాటు దక్షిణాది ప్రేక్షకుల్ని పలకరించింది నటి ఆలియా భట్. ఇటీవలే రణ్‌బీర్‌ని వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ అమ్మడు..
‘గంగూభాయి కాఠియావాడి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో ఉత్తరాదితో పాటు దక్షిణాది ప్రేక్షకుల్ని పలకరించింది నటి ఆలియా భట్. ఇటీవలే రణ్‌బీర్‌ని వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ అమ్మడు.. ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సినీప్రియులకు ఓ కొత్త కబురు వినిపించింది. ‘డార్లింగ్స్’ చిత్రంతో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల్ని పలకరించనున్నట్లు తెలిపింది. దీన్ని జస్మీత్ కె రీన్ తెరకెక్కించారు. షెఫాలీ షా, విజయ్ వర్మ, రోషన్ మాథ్యూ కీలక పాత్రలు పోషించారు. ఇది త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇండియా సంస్థ సోమవారం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. ఈ మేరకు ఓ ఆసక్తికర ప్రచార చిత్రాన్ని నెట్టింట పంచుకున్నారు. ఆ వీడియోలో ఫోన్ మాట్లాడుతూ ఆలియా చేసిన అల్లరి ఆకట్టుకుంది. ఈ సినిమాని గౌరీఖాన్, గౌరవ్వర్మతో కలిసి ఆలియా స్వయంగా నిర్మించడం విశేషం. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్‌కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్‌కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్‌తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్