Pushpa: ‘పుష్ప’ ఓటీటీ రైట్స్‌కు అమెజాన్‌ ప్రైమ్‌ అంత చెల్లించిందా?

అల్లు అర్జున్‌ నటించిన తొలిపాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప- ది రైజ్‌’. దక్షిణాదినే కాదు.. హిందీలోనూ  భారీ విజయాన్ని అందుకుంది. డిసెంబర్‌17న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి ఇప్పటికే రూ.300 కోట్లు దాటింది.

Published : 07 Jan 2022 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లు అర్జున్‌ నటించిన తొలిపాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప- ది రైజ్‌’(Pushpa). దక్షిణాదినే కాదు.. హిందీలోనూ భారీ విజయాన్ని అందుకుంది. డిసెంబర్‌17న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకూ రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. కాగా.. జనవరి 7వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ‘పుష్ప’ స్ట్రీమింగ్‌ కానుంది. థియేటర్లలో విడుదలైన 22వ రోజుకే ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం. హిందీ మినహాయించి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ నేపథ్యంలో ‘పుష్ప’ చిత్రం హక్కులను ప్రైమ్‌ వీడియో ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందనే విషయమై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ట్రేడ్‌ వర్గాల అంచనా ప్రకారం సుమారు రూ.27-30 కోట్లకు ఓటీటీ రైట్స్‌ అమ్ముడయ్యాయన్న టాక్‌ వినిపిస్తోంది. ఓటీటీ ద్వారా పుష్ప టీమ్‌కి వస్తున్న దాని కంటే... శాటిలైట్‌ హక్కుల ద్వారా వచ్చే మొత్తం ఎక్కువ. అయినా థియేటర్లలో వీక్షించలేని వారు.. ఓటీటీలో చూడొచ్చని అమెజాన్‌ ప్రైమ్‌ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించింది. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండో భాగం ‘పుష్ప-ది రూల్‌’ ఈ ఏడాది చివర్లో విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని