అందుకే... ఆ హీరో 65ఏళ్లవయసులోనూ యువకుడిలా కనిపిస్తున్నాడు

బాలీవుడ్‌లో ‘బీవీ నెంబర్‌1’, ‘తాల్‌’, ‘దిల్‌ దడ్కనే దో’ వంటి చిత్రాలతో మెప్పించిన నటుడు అనిల్‌ కుమార్‌ నేడు (శుక్రవారం) 65వ ఏటలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా దర్శకురాలు, కొరియోగ్రాఫర్‌ ఫరాఖాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అనిల్‌ కపూర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Published : 25 Dec 2021 01:26 IST

దర్శకురాలు, కొరియోగ్రాఫర్‌ ఫరాఖాన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌లో ‘బీవీ నెంబర్‌.1’, ‘తాల్‌’, ‘దిల్‌ దడ్కనే దో’ వంటి చిత్రాలతో మెప్పించిన నటుడు అనిల్‌కపూర్‌ నేడు (శుక్రవారం) 65వ సంవత్సరంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా దర్శకురాలు, కొరియోగ్రాఫర్‌ ఫరాఖాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘1992 నుంచి మా ఇద్దరికి మంచి అనుబంధం ఉంది. 65 ఏళ్ల వయసులోనూ అనిల్‌ ఇంత యవ్వనంగా కనిపించడం ఎలా సాధ్యమవుతుందని అందరూ అనుకుంటారు. దానికి వెనుక కారణం కొంత మందికే తెలుసు. ‘చేసే పని మీద ప్యాషన్‌, జీవితం అంటే అభిరుచి, ఇతరుల పట్ల సౌమ్యంగా ఉండటం’ వల్లే ఇదంతా సాధ్యమైంది’’ అని ఆనాటి చిత్రాలను పోస్ట్‌ చేశారు.

అనిల్‌కపూర్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరుడు బోనికపూర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘26 ఏళ్లు అయినా ఇప్పటికీ అదే లుక్స్‌తో ఫిట్‌గా ఉన్నావు. వయసుపై బడే కొద్దీ యువకుడిలా కనిపిస్తున్నావు’ అంటూ 1995లో ‘జుదాయి’ చిత్రీకరణ సందర్భంగా సెట్‌లో దిగిన ఫొటోని షేర్‌ చేశారు. కాగా, అనిల్‌ తన తదుపరి చిత్రం గురించి అప్‌డేట్‌ ఇచ్చారు. హృతిక్‌రోషన్- దీపికా పదుకొణె జంటగా తెరకెక్కుతున్న ‘ఫైటర్‌’లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకుడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని