Bheemla Nayak: సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌లకు భయపడం: ఏపీ మంత్రి బొత్స

సినిమా టికెట్‌ ధరలపై ప్రభుత్వం చర్చిస్తోందని.. పెంపుపై అంత ఆత్రుత ఉంటే భీమ్లానాయక్‌ సినిమా వాయిదా వేసుకోవచ్చు కదా! అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విజయనగరం జిల్లా సమీక్షా సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ...

Updated : 25 Feb 2022 18:49 IST

విజయనగరం: సినిమా టికెట్‌ ధరలపై ప్రభుత్వం చర్చిస్తోందని.. పెంపుపై అంత ఆత్రుత ఉంటే ‘భీమ్లానాయక్‌’ సినిమా వాయిదా వేసుకోవచ్చు కదా! అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విజయనగరం జిల్లా సమీక్షా సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ... భీమ్లానాయక్‌ సినిమా విడుదల సందర్భంగా టికెట్‌ ధరలు తగ్గించటం, పంపిణీదారులు, థియేటర్ల యజమానుల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలపై స్పందించారు.

‘‘చట్ట ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్తుంది తప్ప.. వ్యక్తుల కోసం కాదు. ప్రజల కోసం ఆలోచన చేయాలి. సినిమా టికెట్ల విషయంలో ఒక కమిటీ వేశాం. ఆ అంశం ఇంకా నడుస్తోంది. టికెట్ల ధరలు గిట్టుబాటు కాకపోతే.. సినిమా విడుదల వాయిదా వేసుకోమనండి. సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం చట్ట ప్రకారం ముందుకు వెళ్తోంది. ఈ విషయంపై ఇప్పటికే సినిమా రంగం తరఫున చిరంజీవి.. ముఖ్యమంత్రిని కలిశారు. విధి విధానాలపై కమిటీ కూడా వేశాం. ఈ విషయంపై విమర్శలు చేసే వారు.. వ్యక్తుల కోసం కాదు ప్రజల కోసం ఆలోచించాలి. ప్రస్తుతం టికెట్ల ధరలు నచ్చకపోయినా.. గిట్టుబాటు కాకపోయినా సినిమా వాయిదా వేసుకోమనండి. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌లకు ప్రభుత్వం భయపడదు’’ అని బొత్స సత్యనారాయణ అన్నారు.

అమరావతి రైతుల ఉద్యమానికి 800 రోజులు పూర్తయిన సందర్భంగా చేపట్టిన నిరాహారదీక్షపై మంత్రి మాట్లాడుతూ.. అమరావతి రైతులు చేసేది ఉద్యమం కాదు. అది ఒక రాజకీయ ఉద్యమమని పేర్కొన్నారు. అమరావతి రాజధానిగా కావాలంటూ తెదేపా కార్యకర్తలు చేస్తున్న ఉద్యమంగా మంత్రి అభివర్ణించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని