ram charan: రెహమాన్‌కు స్వాగతం

రామ్‌చరణ్‌ - బుచ్చిబాబు సానా కలయికలో రూపొందుతున్న చిత్రానికి ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ విషయాన్ని రెహమాన్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని శనివారం ప్రకటించింది చిత్రబృందం.

Updated : 07 Jan 2024 09:29 IST

రామ్‌చరణ్‌ - బుచ్చిబాబు సానా కలయికలో రూపొందుతున్న చిత్రానికి ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ విషయాన్ని రెహమాన్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని శనివారం ప్రకటించింది చిత్రబృందం.క్రీడా నేపథ్య కథతో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందనుంది. రామ్‌చరణ్‌ మరో వినూత్నమైన పాత్రలో  కనిపించనున్నారు. రామ్‌చరణ్‌ సామాజిక మాధ్యమాల ద్వారా రెహమాన్‌కి స్వాగతం పలికారు. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వెంకట సతీశ్‌ కిలారు నిర్మాత.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని