Malaika Arora: మలైకా అరోఢాతో డేటింగ్‌.. పెళ్లిపై స్పందించిన హీరో..

మలైకా అరోఢాతో డేటింగ్‌, పెళ్లి గురించి అర్జున్‌ కపూర్‌ (Arjun Kapoor) స్పందించారు. ట్రోలింగ్‌లను పట్టించుకోనని చెప్పారు.

Published : 14 Dec 2023 16:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ నటి మలైకా అరోఢాతో (Malaika Arora) ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ గతకొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు. తన కంటే 12ఏళ్లు పెద్దదైన మలైకాతో అర్జున్‌ డేటింగ్‌ చేయడంపై ఇప్పటికే పలుసార్లు విమర్శలు ఎదురయ్యాయి. తాజాగా వీటిపై ఆయన స్పందించారు. అలాగే ఆమెతో పెళ్లి గురించి కూడా అర్జున్‌ మాట్లాడారు. ‘కాఫీ విత్‌ కరణ్ సీజన్‌ 8’ తాజా ఎపిసోడ్‌కు ఆదిత్య కపూర్‌తో కలిసి అర్జున్‌ కపూర్‌ హాజరై సందడి చేశారు.

మలైకాతో డేటింగ్‌పై వచ్చిన విమర్శల గురించి మాట్లాడుతూ.. ‘సినీ పరిశ్రమలో విమర్శలు ఎదుర్కొని వారు ఎవరూ ఉండరు. ట్రోలింగ్‌ను మనం ఎలా తీసుకుంటామనేది ముఖ్యం. ఇలా తప్పుడు కామెంట్లు చేసేవారిని నేను పట్టించుకోను. ఏదోఒకటి రాసి మన దృష్టిని ఆకర్షించాలని వారంతా ప్రయత్నిస్తుంటారు. మొదట ఇలాంటివి చూస్తే బాధేసేది. కానీ, వీటిని పట్టించుకోవడం కంటే మౌనంగా ఉండడం ఉత్తమమని అర్థం చేసుకున్నా. లైకుల కోసం అలా రాసిన వాళ్లే.. మనం కనిపించినప్పుడు సెల్ఫీల కోసం ఎగబడతారు’ అని చెప్పారు. ఇక మలైకాతో పెళ్లిపై స్పందిస్తూ.. ‘పెళ్లి అనేది జీవితంలో ఎంతో ముఖ్యమైనది. నా జీవితంలో ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నాను. మలైకా లేకుండా ఇక్కడ కూర్చుని పెళ్లి గురించి, భవిష్యత్తు గురించి చర్చించడం సరికాదనిపిస్తోంది. వివాహం అనేది అత్యంత సంతోషకరమైన విషయం. మేము ఆ స్థాయికి చేరుకోగానే మేమిద్దరం కలిసి వచ్చి మాట్లాడుతాం. ఆమె లేకుండా పెళ్లి గురించి మాట్లాడలేను’ అన్నారు.

‘సలార్‌’పై వదంతులు.. మౌనం వీడిన నిర్మాత

ఇక ఈ షోలోనే అనన్యపాండేతో డేటింగ్‌ రూమర్స్‌పై ఆదిత్యరాయ్‌ కపూర్‌ (Aditya Roy Kapur) పెదవి విప్పారు. రహస్యాలు అడగొద్దు కచ్చితంగా అబద్ధాలే చెబుతాను అని సరదాగా స్పందించారు. తనతో ఉంటే ఆనందంగా ఉంటానని సమాధానమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని