Atlee: షారుక్‌.. విజయ్‌ ఓ మల్టీస్టారర్‌

అభిమానులకు శుభవార్త. ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు షారుక్‌ఖాన్‌, తమిళ అగ్రహీరో విజయ్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించనున్నారు.

Updated : 15 Nov 2023 13:21 IST

భిమానులకు శుభవార్త. ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు షారుక్‌ఖాన్‌, తమిళ అగ్రహీరో విజయ్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్టు ఖాయమనీ, ఇదే స్క్రిప్టుపై పని చేస్తున్నాననీ.. దర్శకుడు అట్లీ మంగళవారం ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీంతో ఎన్నాళ్లుగానో వస్తున్న వార్తలకు ఇకపై తెర పడనుంది. ఈ విషయంపై మాట్లాడుతూ ‘చెన్నైలో ‘జిందా బందా’ పాట షూటింగ్‌ జరుగుతున్నప్పుడు విజయ్‌ అన్నని మా పార్టీకి ఆహ్వానించాను. ఆ సమయంలోనే షారుక్‌, విజయ్‌ కలిసి చాలాసేపు చర్చించుకున్నారు. ‘నువ్వు ఇద్దరు హీరోల సినిమా ఏదైనా చేయాలనుకుంటే చెప్పు.. మేం చేస్తాం’ అన్నారు షారుక్‌. విజయ్‌ అన్న సైతం దానికి ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్‌పైనే పని చేస్తున్నా. ఇద్దరి ఇమేజ్‌కి తగ్గట్టుగా కథ ఉండేలా కసరత్తు చేస్తున్నా. బహుశా షూటింగ్‌కి వెళ్లే నా తదుపరి చిత్రం అదే అవుతుంది’ అంటూ ఈ ఆసక్తికర కాంబినేషన్‌ వెనక ఉన్న కథని వివరించాడు అట్లీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని