balakrishna: అఖండ2.. రంగం సిద్ధమైందా?

‘అఖండ2’ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమైందా? బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్న తదుపరి చిత్రం అదేనా? అధికారిక సమాచారమైతే లేదు కానీ... చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఈ విషయాలపైనే చర్చ జరుగుతోంది.

Updated : 08 Feb 2024 09:45 IST

‘అఖండ2’ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమైందా? బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్న తదుపరి చిత్రం అదేనా? అధికారిక సమాచారమైతే లేదు కానీ... చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఈ విషయాలపైనే చర్చ జరుగుతోంది. ఇటీవలే బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ పతాకంపై ఓ సినిమా రూపొందనున్నట్టు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కథానాయకుడు ఎవరనే వివరాల్ని మాత్రం వెల్లడించలేదు. అల్లు అర్జున్‌, సూర్య కోసం బోయపాటి శ్రీను కథలు సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఆ కథానాయకులు ప్రస్తుతం ఇతర చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ దశలోనే బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో సినిమా గురించి పరిశ్రమ వర్గాలు ప్రముఖంగా మాట్లాడుకోవడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఈ కలయికలో ‘అఖండ2’నే పట్టాలెక్కుతుందా లేక, వేరే కథతో సినిమా చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ‘అఖండ’కి కొనసాగింపు ఉంటుందని ఆ సినిమా విడుదల సమయంలోనే స్పష్టం చేశారు దర్శకుడు బోయపాటి. ‘అఖండ 2’ కోసం ఇప్పటికే స్క్రిప్ట్‌ కూడా సిద్ధమైనట్టు సమాచారం. సమీకరణలన్నీ కుదిరితే ఆ సినిమానే పట్టాలెక్కే అవకాశాలున్నాయి. 2021లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘అఖండ’ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని