
Dilraju: విజయ్‌కి మా కథ ఎంతలా నచ్చిందంటే..!
సరికొత్త ప్రాజెక్ట్‌పై దిల్‌రాజు ఏం చెప్పారంటే
హైదరాబాద్: ఓవైపు యువ హీరోలతో యూత్‌ఫుల్ కంటెంట్ ఉన్న సినిమాలు.. మరోవైపు స్టార్హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. ఇటీవల సంక్రాంతికి ‘రౌడీ బాయ్స్’తో మిశ్రమ స్పందనలు అందుకున్న ఆయన ఇప్పుడు రామ్‌చరణ్, విజయ్ క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీ అయ్యారు. ఆ రెండు భారీ చిత్రాలపై తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఆ రెండు సినిమాల విడుదల తేదీలపై స్పందించారు. ముఖ్యంగా విజయ్ హీరోగా చేయనున్న సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వంశీ చెప్పిన కథ విజయ్‌కి బాగా నచ్చిందని ఆయన అన్నారు.
‘‘మా డైరెక్టర్ వంశీ.. విజయ్ కోసం అద్భుతమైన కథ సిద్ధం చేశారు. ఈ సినిమా కథ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా తప్పకుండా నాకు, మా బ్యానర్‌కి, వంశీకి మంచి పేరు తెచ్చిపెడుతుందని నమ్ముతున్నాను. ముఖ్యంగా విజయ్.. కథ విన్న వెంటనే నచ్చిందని చెప్పారు. అంతేకాకుండా సుమారు 20 సంవత్సరాల తర్వాత తాను ఇలాంటి ఒక అద్భుతమైన కథ విన్నట్లు విజయ్ మాతో చెప్పారు. ఒక స్టార్ హీరో నుంచి అలాంటి కామెంట్ రావడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభించాలనుకుంటున్నాం. అదే మాదిరిగా శంకర్-రామ్‌చరణ్ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. అది కూడా పవర్ఫుల్ కథతో సిద్ధమవుతోంది. కరోనా లేకపోతే ఈ ఏడాది దీపావళికి ఒక చిత్రాన్ని, వచ్చే ఏడాది సంక్రాంతికి ఒక చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నాను. పరిస్థితులపై ఆధారపడి దీపావళికి రిలీజ్ చేసేలా ఆలోచిస్తాం. వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రం తప్పకుండా ఒక చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని దిల్‌రాజు వివరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.