Gali Nageswara rao: ‘గాలి నాగేశ్వరరావు’ జోరు

మంచు విష్ణు కథానాయకుడిగా ఈషాన్‌ సూర్య తెరకెక్కిస్తున్న చిత్రం ‘గాలి నాగేశ్వరరావు’. అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. పాయల్‌ రాజ్‌పూత్‌, సన్నీలియోన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ

Updated : 09 Apr 2022 09:01 IST

మంచు విష్ణు కథానాయకుడిగా ఈషాన్‌ సూర్య తెరకెక్కిస్తున్న చిత్రం ‘గాలి నాగేశ్వరరావు’. అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. పాయల్‌ రాజ్‌పూత్‌, సన్నీలియోన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర రెండో షెడ్యూల్‌ తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది. ఈ షెడ్యూల్‌లో భాగంగా మంచు విష్ణు, సన్నీ లియోన్‌తో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సెట్లో విష్ణుతో కలిసి చేసిన ఓ ఫన్నీ వీడియోని సన్నీలియోన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ సినిమాలో ఆమె రేణుకగా కనిపించనుంది. స్వాతి అనే పాత్రలో పాయల్‌ సందడి చేయనుంది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: చోటా.కె.నాయుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని