Game Changer: దీపావళికి గేమ్‌ ఛేంజర్‌ పాట

కథానాయకుడు రామ్‌చరణ్‌.. దర్శకుడు శంకర్‌ కలయికలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’.

Updated : 25 Oct 2023 13:34 IST

థానాయకుడు రామ్‌చరణ్‌.. దర్శకుడు శంకర్‌ కలయికలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. అంజలి, సముద్రఖని, ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలోని ‘‘జరగండి..’’ గీతాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని విజయ దశమి సందర్భంగా అధికారికంగా ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘రాజకీయ అంశాలతో ఉన్న యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో చరణ్‌ లార్జర్‌ దేన్‌ లైఫ్‌ పాత్రలో కనిపించనున్నారు. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి తమన్‌ సంగీతమందిస్తుండగా.. ఎస్‌.తిరుణావుక్కరసు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని