Gehraiyaan Teaser: బోల్డ్‌గా దీపికా పదుకొణె..గెహ్రాహియా టీజర్‌ చూశారా?

బాలీవుడ్‌ నటులు దీపికా పదుకొణె- సిద్ధాంత్‌ చతుర్వేది, అనన్యా పాండే- ధైర్యా కర్వా జంటలుగా నటించిన రొమాంటిక్‌ చిత్రం ‘గెహ్రియాన్‌’. అమెజాన్‌ ప్రైమ్‌  ఓటీటీ వేదికగా వచ్చే ఏడాది జనవరి25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 20 Dec 2021 18:24 IST

ఆకట్టుకునేలా గెహ్రాహియా టీజర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటులు దీపికా పదుకొణె- సిద్ధాంత్‌ చతుర్వేది, అనన్యా పాండే- ధైర్యా కర్వా జంటలుగా నటించిన రొమాంటిక్‌ చిత్రం ‘గెహ్రాహియా’. అమెజాన్‌ ప్రైమ్‌  ఓటీటీ వేదికగా వచ్చే ఏడాది జనవరి25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గెహ్రాహియా టీజర్‌ను దీపికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. టీజర్‌ ప్రారంభంలో బోల్డ్‌గా దర్శనమిచ్చింది. సిద్ధాంత్‌ చతుర్వేదితో ముద్దు సన్నివేశాలతో పాటు బీచ్‌లో బికినీలో కనిపించింది. కాగా గెహ్రాహియా చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది దీపిక .  ప్రేమ, అందులో ఉండే పరిణామాల చుట్టూ కథను తీర్చిదిద్దాడు దర్శకుడు షకున్‌ బత్రా. నసీరుద్దీన్‌ షా, రాజాత్‌  కపూర్‌ కీలక పాత్రలు పోషించారు. సుమిత్‌ రాయ్‌ కథ అందించగా  కరణ్‌ జోహర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ ధర్మా ప్రొడక్షన్స్‌ హౌస్‌ నిర్మిస్తుంది. ఇక ఈ టీజర్‌ బాగుందంటూ బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌, టాలీవుడ్‌ ప్రముఖ నటి సమంత ప్రశంసించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని