
HariHara Verra Mallu: చాందినీ చౌక్‌లో...
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ కోసం మరో సెట్‌ని నిర్మించేందుకు చిత్రబృందం సన్నాహాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. మొఘల్ కాలం నేపథ్యంలో సాగే కథతో ఆ చిత్రం తెరకెక్కుతోంది. అప్పటి వాతావరణం ప్రతిబింబించేలా పలు చారిత్రాత్మక కట్టడాల్ని సెట్స్‌గా తీర్చిదిద్దుతూ, ఆ నేపథ్యంలోనే చిత్రీకరణ చేస్తున్నారు. అందులో భాగంగానే చాందినీ చౌక్ సెట్‌ని నిర్మించే ప్రయత్నాలు మొదలయ్యాయని సమాచారం. కొత్త షెడ్యూల్ చాందినీ చౌక్ నేపథ్యంలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. పవన్‌కల్యాణ్‌కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఎ.దయాకర్‌రావు, ఎ.ఎమ్.రత్నం నిర్మాతలు. బాలీవుడ్ తారలు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ నటిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.