Sharwanand: సెప్టెంబర్‌లో ‘ఒకే ఒక జీవితం’

శర్వానంద్‌ కథానాయకుడిగా శ్రీ కార్తీక్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది.

Published : 10 Aug 2022 04:07 IST

శర్వానంద్‌ కథానాయకుడిగా శ్రీ కార్తీక్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది. రీతూ వర్మ కథానాయిక. అమల అక్కినేని ముఖ్య పాత్రలో నటించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రం సెప్టెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ‘‘ఇదొక విభిన్నమైన సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా. తల్లీకొడుకుల అనుబంధాల నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కింది. సినిమాలో గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యముంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమా తమిళంలో ‘కణం’ పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్‌ బిజోయ్‌, కూర్పు: శ్రీజిత్‌ సారంగ్‌, ఛాయాగ్రహణం: సుజిత్‌ సారంగ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని