ఆ ధైర్యంతోనే ప్రయాణం మొదలుపెట్టా

‘‘కొత్త ప్రతిభని పరిచయం చేస్తూ...  కొత్త ఆలోచనలతో కూడిన సినిమాలు చేయాలనే నిర్మాణ సంస్థని ప్రారంభించా. కానీ ‘అలాంటి సినిమాలు చూడరు కదా’ అని చాలా మంది భయపెట్టారు.

Published : 06 Dec 2022 01:10 IST

- నాని

‘‘కొత్త ప్రతిభని పరిచయం చేస్తూ...  కొత్త ఆలోచనలతో కూడిన సినిమాలు చేయాలనే నిర్మాణ సంస్థని ప్రారంభించా. కానీ ‘అలాంటి సినిమాలు చూడరు కదా’ అని చాలా మంది భయపెట్టారు. నేను మాత్రం చూస్తారనే ఓ బలమైన ధైర్యంతో ప్రయాణం మొదలుపెట్టా. నా ఉద్దేశం సరైనదే అని ప్రేక్షకులు  నిరూపించార’’న్నారు కథానాయకుడు నాని. ఆయన వాల్‌పోస్టర్‌ సినిమా పతాకంపై సమర్పించిన ‘హిట్‌ 2’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అడివి శేష్‌ కథానాయకుడిగా నటించారు. విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా చిత్రబృందం ఇటీవల విజయోత్సవాన్ని నిర్వహించారు. నేను మేజిక్‌ని నమ్మితే, శేష్‌ లాజిక్‌ని నమ్మి కష్టపడి పనిచేస్తుంటాడు. అందుకే తనకి వరుసగా విజయాలొస్తున్నాయి. నేను వేరే సినిమాలతో బిజీగా ఉన్నా వాల్‌పోస్టర్‌ బృందం కష్టపడి పనిచేసింది. నటీనటులు, సాంకేతిక బృందం పడిన కష్టానికి ప్రతిఫలంగా నాకు అభినందనలు అందుతున్నాయి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో మీనాక్షి చౌదరి, చిత్ర దర్శకుడు శైలేష్‌ కొలను తదితరులు పాల్గొన్నారు. నాని ‘హిట్‌2’లో అర్జున్‌ సర్కార్‌గా కనిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని