సంగీత ప్రయాణం
విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకొచ్చారు మహేష్. ఇటీవలే ఓ ప్రకటన చిత్రీకరణలో పాల్గొన్నారు.
విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకొచ్చారు మహేష్. ఇటీవలే ఓ ప్రకటన చిత్రీకరణలో పాల్గొన్నారు. తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో విషాదంలో మునిగిపోయిన ఆయన... ఇప్పుడిప్పుడే అందులో నుంచి బయటికొచ్చి కెరీర్‌పై దృష్టి పెడుతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణని త్వరలోనే షురూ చేయడం కోసం రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ లోపుగానే సంగీత చర్చలకోసం చిత్రబృందం దుబాయ్ వెళ్లనుంది. మహేష్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ స్వరాలు సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. కథానాయకుడు మహేష్, సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు త్రివిక్రమ్ కలిసి కొన్నాళ్లపాటు దుబాయ్‌లో గడపనున్నట్టు సమాచారం. ‘అల వైకుంఠపురములో’ తర్వాత త్రివిక్రమ్ - తమన్ కలిసి చేస్తున్న చిత్రమిది. సంగీతం ఆ సినిమా ఫలితంపై గట్టి ప్రభావమే చూపించింది. ఈసారి కూడా సంగీతంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. అభిమానుల్ని అలరించేలా ఇందులో ఓ ప్రత్యేక గీతం కోసం సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వేసవి తర్వాత షురూ?
మహేష్ - రాజమౌళి కలయికలో చిత్రాన్ని పట్టాలెక్కించడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయా? వచ్చే వేసవి తర్వాత సినిమా షురూ కానుందా? ఈ ప్రశ్నలకి అవుననే సమాధానలే వినిపిస్తున్నాయి పరిశ్రమ వర్గాలు. ఇప్పటికే ఆ సినిమా కోసం రచయిత విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేస్తున్నారు. సాహసోపేతమైన ప్రయాణం నేపథ్యంలో ఆ సినిమా రూపొందుతుందని దర్శకుడు రాజమౌళి ఇదివరకే వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
SC: ఆ రికార్డులు సమర్పించండి.. బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
-
Politics News
TS Assembly: ‘ఎందుకు రావట్లేదు’- కేటీఆర్... ‘పిలిస్తే కదా వచ్చేది’- ఈటల
-
Movies News
Thunivu: ఓటీటీలో ‘తునివు’ వచ్చేస్తోంది.. రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే..?
-
World News
North Korea: రూ.13.9వేల కోట్లు కొల్లగొట్టిన కిమ్ ‘జాతిరత్నాలు’..!
-
Latestnews News
IND vs AUS: అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆసీస్ ‘డూప్లికేట్’ వ్యూహం!
-
India News
Mumbai: ముంబయిలో ఉగ్ర దాడులంటూ ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్..!