ShahRukh Khan: విరామం తర్వాత జూన్‌లో సెట్లోకి

గతేడాది బ్లాక్‌బస్టర్‌ హిట్లతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు షారుక్‌ ఖాన్‌. ఇప్పటి వరకూ ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు.

Updated : 05 May 2024 09:50 IST

తేడాది బ్లాక్‌బస్టర్‌ హిట్లతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు షారుక్‌ ఖాన్‌. ఇప్పటి వరకూ ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. మళ్లీ ఎప్పుడెప్పుడు ఆయనను తెరపై చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఓ తీపి కబురు వినిపించారు షారుక్‌. జూన్‌ నుంచి తన రాబోయే సినిమా చిత్రీకరణను మొదలుపెట్టనున్నట్లు తెలిపారాయన. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షారుక్‌.. ఇంకా తన తదుపరి ప్రాజెక్టును ప్రారంభించకపోవడానికి గల కారణాలను పంచుకున్నారు. ‘‘నేను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాను. గతేడాది వరుసగా మూడు సినిమాలు చేశాను. విశ్రాంతి లేకుండా పనిచేస్తూ.. నా శరీరాన్ని చాలా కష్టపెట్టాను. దీంతోపాటు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆడే ప్రతి మ్యాచ్‌కు హాజరవుతానని వాళ్లకు చెప్పాను. అందుకే సినిమాలకు కొంత విరామం ఇచ్చి మ్యాచ్‌లు చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నాను. నా తర్వాత సినిమా షూటింగ్‌ను జూన్‌లో మొదలు పెట్టబోతున్నాన’’ని చెప్పుకొచ్చారు. ఆయన, తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి ‘కింగ్‌’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని