Vijay Deverakonda: గ్రామీణ నేపథ్యంలో యాక్షన్‌ కథ

కథానాయకుడు విజయ్‌ దేవరకొండ కొత్త సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవికిరణ్‌ కోలా దర్శకత్వం వహిస్తున్నారు.

Updated : 05 May 2024 09:52 IST

థానాయకుడు విజయ్‌ దేవరకొండ కొత్త సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవికిరణ్‌ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు - శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థకి ఇది 59వ చిత్రం. ఇదివరకు ‘రాజా వారు రాణిగారు’ సినిమాని తెరకెక్కించిన దర్శకుడే రవికిరణ్‌ కోలా. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాల్ని ఈ నెల 9న వెల్లడించనున్నట్టు చిత్ర నిర్మాణ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని