Pooja Hegde: ‘కథలు చెప్పడానికే ఇక్కడున్నా’ : పూజా హెగ్డే

తరచి చూడాలి కానీ... పూజా హెగ్డే ప్రతిభలో ఎన్నో కోణాలు కనిపిస్తాయి. ఆల్‌రౌండర్‌ అనిపించుకోవాలనే లక్ష్యంతోనే కెమెరా ముందుకొచ్చారా? అని అడిగితే... ‘‘కథలు చెప్పడానికే నేను ఇక్కడున్నది.

Updated : 18 Apr 2023 10:27 IST

రచి చూడాలి కానీ... పూజా హెగ్డే ప్రతిభలో ఎన్నో కోణాలు కనిపిస్తాయి. ఆల్‌రౌండర్‌ అనిపించుకోవాలనే లక్ష్యంతోనే కెమెరా ముందుకొచ్చారా? అని అడిగితే... ‘‘కథలు చెప్పడానికే నేను ఇక్కడున్నది. సినిమాలో ఒక పాట కూడా ఓ కథ చెబుతుంది. అందుకే నచ్చినప్పుడు పాటలూ చేస్తుంటా. చిన్నప్పుడు డాన్స్‌ చేయాలంటే బెరుగ్గా ఉండేది. భరతనాట్యం నేర్చుకునేలా మా అమ్మ ప్రోత్సహించారు. అప్పట్నుంచి ఆడిపాడటాన్ని ఆస్వాదించడం అలవాటు చేసుకున్నా. ఆ అలవాటు, ఇష్టమే ప్రత్యేక గీతాలపై ఆసక్తిని పెంచింది. ఇక నటన అంటారా? ప్రతి భాషలోనూ ఓ ప్రత్యేకమైన శక్తి కనిపిస్తుంటుంది. అందుకే పలు భాషల్లో నటించడాన్ని గౌరవంగా భావిస్తుంటా. నటిగా నాకు ఇంకా చాలా లక్ష్యాలే ఉన్నాయి. ముఖ్యంగా మహిళల్లో  స్ఫూర్తిని నింపే పాత్రలు చేయాలని ఉంటుంది’’ అని చెప్పుకొచ్చింది పూజాహెగ్డే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని