Siddharth: అదితిరావ్‌, సిద్ధార్థ్‌ల పెళ్లి!

కథానాయకుడు సిద్ధార్థ్‌, నాయిక అదితిరావ్‌ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది.

Updated : 28 Mar 2024 12:23 IST

థానాయకుడు సిద్ధార్థ్‌, నాయిక అదితిరావ్‌ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్థులను, మీడియాను, ఇతరులను ఎవరినీ ఆలయంలోకి అనుమతించలేదు. తమిళనాడు నుంచి వచ్చిన పూజారులు పెళ్లి చేశారు. వనపర్తి సంస్థానాధీశుల వారసుడు రాజా కృష్ణదేవరావు, ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అదితిరావ్‌ హైదరీ వనపర్తి సంస్థానాధీశుల చివరి రాజా రామేశ్వరరావుకు మనువరాలు. ప్రస్తుతం ఉన్న రాజా కృష్ణదేవరావుకు మేనకోడలు. పెళ్లి అయిన అనంతరం వనపర్తిలోని సంస్థానాధీశుల వాసుదేవమ్మ తోటలో విందు జరిగింది. ఇటీవల సిద్ధార్థ్‌, అదితిరావ్‌ హైదరీ రంగనాథస్వామిని దర్శించుకుని ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించినట్లు సమాచారం. కానీ ఆలయంలో పనిచేసే సిబ్బందికి, గ్రామస్థులకు సినిమా షూటింగ్‌ కోసం ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు చెప్పారు. పెళ్లికి సంబంధించి ఇరు కుటుంబాల నుంచి అధికారికంగా ఎవరూ స్పందించ లేదు. ఈ ఇద్దరూ కలిసి ‘మహా సముద్రం’ చిత్రంలో నటించారు.

న్యూస్‌టుడే, వనపర్తి న్యూటౌన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని