Game Changer: ఆట మార్చే మాస్‌ పాట

‘సిక్స్‌ ప్యాక్‌లో యముడండీ... సిస్టమ్‌ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్‌చరణ్‌ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్‌ ఛేంజర్‌’ పాట. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా... శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది.

Updated : 28 Mar 2024 12:16 IST

‘సిక్స్‌ ప్యాక్‌లో యముడండీ... సిస్టమ్‌ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్‌చరణ్‌ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్‌ ఛేంజర్‌’ పాట. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా... శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ‘గేమ్‌ ఛేంజర్‌’లోని ‘జరగండి జరగండి...’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. తమన్‌ స్వరకల్పనలోని ఈ పాటని, అనంతశ్రీరామ్‌ రచించారు. దలేర్‌ మెహందీ, సునిధి చౌహాన్‌ ఆలపించారు. శంకర్‌ మార్క్‌ భారీహంగులతో ఈ పాటని తెరకెక్కించినట్టు లిరికల్‌ వీడియో స్పష్టం చేసింది. రామ్‌చరణ్‌ యువ ఐఏఎస్‌ అధికారిగా కనిపించనున్న ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. శ్రీకాంత్‌, ఎస్‌.జె.సూర్య, సునీల్‌, అంజలి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: తిరుణ్ణావుక్కరసు, యాక్షన్‌: అన్బరివు, కథ: కార్తీక్‌ సుబ్బరాజు, సంభాషణలు: సాయిమాధవ్‌ బుర్రా, కళ: అవినాష్‌ కొల్లా, రామకృష్ణ, మోనిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని