Bobby Deol: అలియా స్పై ప్రపంచంలోకి బాబీ దేవోల్‌?

పాత్ర ఏదైనా అలవోకగా నటించగల సత్తా ఉన్న నటి అలియా భట్‌.

Updated : 30 Mar 2024 12:08 IST

పాత్ర ఏదైనా అలవోకగా నటించగల సత్తా ఉన్న నటి అలియా భట్‌. ఇప్పుడు యాక్షన్‌ హంగామా చేయడానికి ముస్తాబవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ రూపొందిస్తున్న ఓ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌లో అలియా భట్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శర్వరీ వాఘ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. తాజాగా ఈ సినిమాలో బాబీ దేవోల్‌ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘యానిమల్‌’ చిత్రంలో విలన్‌ పాత్రలో కనిపించి ప్రశంసలు అందుకున్న బాబీ దేవోల్‌.. ఇప్పుడు మరోసారి ప్రతినాయకుడిగా కనిపించడానికి సిద్ధమయ్యారు. అలియా, శర్వరీలను ఓడించడానికి గూఢచారి ప్రపంచంలోకి మొదటిసారి అడుగుపెట్టబోతున్నాడు. ఇందులో బాబీ సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. తన పాత్ర కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నాడీయన. ఈ ఏడాది ద్వితీయార్ధంలో చిత్రీకరణను మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తుంది చిత్రబృందం’’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని