Keerthy Suresh: తొలి హిందీ చిత్రం కాస్త ఆలస్యం?

భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది కీర్తి సురేశ్‌. త్వరలో ఆమె ‘బేబీ జాన్‌’తో ప్రేక్షకులను పలకరించనుంది.

Updated : 17 Apr 2024 11:59 IST

భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది కీర్తి సురేశ్‌. త్వరలో ఆమె ‘బేబీ జాన్‌’తో ప్రేక్షకులను పలకరించనుంది. ఆమె, బాలీవుడ్‌ కథానాయకుడు వరుణ్‌ ధావన్‌ జంటగా నటిస్తున్న చిత్రమిది. ఇంటెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఎ.కాలీస్‌ తెరకెక్కిస్తున్నారు. వామికా గబ్బీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. మే 31న ఇది విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా రాకకు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ‘‘అనుకున్న తేదీకి విడుదల చేయాలని చిత్రీకరణను వేగవంతం చేసింది చిత్రబృందం. కానీ.. పోస్ట్‌-ప్రొడక్షన్‌ పనులు తదితర కారణాల వల్ల జులైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నార’’ని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అట్లీ, జ్యోతి దేశ్‌పాండే, మురాద్‌ ఖేతానీ నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని