Shah Rukh Khan: రాజ్‌కుమార్ హిరాణి- షారుఖ్ కాంబో.. టైటిల్ ఇదే
షారుఖ్ ఖాన్ హీరోగా ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి ఓ చిత్రం రూపొందిస్తున్నారనే సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: షారుఖ్ ఖాన్ హీరోగా ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి ఓ చిత్రం రూపొందిస్తున్నారనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన తాజాగా విడుదలైంది. రాజ్‌కుమార్ హిరాణి, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘డంకీ’ (Dunki) అనే పేరు ఖరారైంది. ఈ మేరకు ఓ ఆసక్తికర వీడియోను చిత్ర బృందం పంచుకుంది. ఇందులో.. దర్శకుడి గత చిత్రాల గురించి చెప్తూ కనిపించాడు షారుఖ్. ఈ విభిన్న కథా చిత్రంలో షారుఖ్‌కు జోడీగా తాప్సీ సందడి చేయనుంది. ఈ సినిమాని 2023 డిసెంబరు 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మరోవైపు, ‘పఠాన్’తో బిజీగా ఉన్న ఆయన తమిళ దర్శకుడు అట్లీతో ఓ చిత్రం ఖరారు చేశారు. 2018లో వచ్చిన ‘జీరో’ తర్వాత షారుఖ్ మళ్లీ తెరపై కనిపించకపోవడంతో ఆయన కొత్త చిత్రాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘లగే రహో మున్నా భాయ్’, ‘3 ఇడియట్స్’, ‘పీకే’, ‘సంజు’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడే రాజ్‌కుమార్ హిరాణి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్‌లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు