లెస్బియన్‌గా మాధురీ దీక్షిత్‌?

తేజాబ్‌, దిల్‌, సాజన్‌, బేటా, హమ్‌ ఆప్కే హై కౌన్‌.. లాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్‌   సినిమాలతో అలరించిన అలనాటి అందాల కథానాయిక మాధురీ దీక్షిత్‌ ప్రస్తుతం ఓ ఆసక్తికర పాత్రలో నటించనుంది.

Published : 15 May 2022 01:32 IST

తేజాబ్‌, దిల్‌, సాజన్‌, బేటా, హమ్‌ ఆప్కే హై కౌన్‌.. లాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్‌   సినిమాలతో అలరించిన అలనాటి అందాల కథానాయిక మాధురీ దీక్షిత్‌ ప్రస్తుతం ఓ ఆసక్తికర పాత్రలో నటించనుంది. అమెజాన్‌ ప్రైమ్‌ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రం పేరు ‘మజా మా’. ఇది కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మాధురీ హోమో సెక్సువల్‌గా నటించనున్నట్లు కొన్ని హిందీ సైట్లు పేర్కొన్నాయి. ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా ఈ పాత్రని తీర్చిదిద్దినట్లు సమాచారం. ఆనంద్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గజరాజ్‌ రావ్‌, రిత్విక్‌ భౌమిక్‌, రజిత్‌ కపూర్‌, బర్ఖా సింగ్‌, సిమోన్‌ సింగ్‌  నటిస్తున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని