Vijay: విజయ్‌ గానం

‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’తో సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు విజయ్‌.

Updated : 12 Mar 2024 09:30 IST

‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’తో సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు విజయ్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని వెంకట్‌ ప్రభు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. మీనాక్షి చౌదరి కథానాయిక.  ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ  శరవేగంగా జరుగుతోంది. కాగా, ఈ చిత్రం కోసం విజయ్‌ స్వయంగా ఓ పాట పాడినట్లు సమాచారం. దీనిపై సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా కూడా స్పష్టత ఇచ్చారు. ఇటీవల బెంగళూరులోని ఓ కచేరీలో పాల్గొన్న యువన్‌.. తమ రాబోయే సినిమా కోసం విజయ్‌ గాత్రంతో ఓ పాట రికార్డు చేసినట్లు వెల్లడించారు. ఈ గీతానికి వెంకట్‌ ప్రభు తండ్రి గంగై అమరన్‌ సాహిత్యమందించినట్లు ప్రచారం వినిపిస్తోంది. సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహా, లైలా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు