త్వరలోనే ఓ మూవీ డైరెక్ట్‌ చేస్తా: బోనీ కపూర్‌

త్వరలోనే తాను దర్శకరంగంలోకి అడుగుపెడతానని బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ అన్నారు. పాతికేళ్ల వయసులోనే నిర్మాతగా మారి కొన్ని సంవత్సరాలుగా ఎన్నో విభిన్నమైన చిత్రాలను నిర్మించిన ఆయన తొలిసారి నటుడిగా వెండితెరపై సందడి చేయడానికి...

Published : 04 Feb 2021 01:47 IST

ముంబయి‌: త్వరలోనే తాను ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ అన్నారు. పాతికేళ్ల వయసులోనే నిర్మాతగా మారి కొన్ని సంవత్సరాలుగా ఎన్నో విభిన్నమైన చిత్రాలను నిర్మించిన ఆయన తొలిసారి నటుడిగా వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. రణ్‌బీర్‌ కపూర్‌ కథానాయకుడిగా లవ్‌ రంజన్‌ తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో హీరో తండ్రిగా బోనీ కనిపించనున్నారు. ఈ నేపథ్యంలోనే తాజగా ఆయన నటుడిగా మారడానికి గల కారణం గురించి వెల్లడించారు.

‘లవ్‌ రంజన్‌ కారణంగానే ఆ సినిమాలో నటించడానికి ఓకే చేశాను. ఆ పాత్ర గురించి మొదట అతను నా పిల్లల్ని కలిశాడు. వాళ్లే నన్ను ఒప్పించారు. ఎందుకంటే ఏ విషయంలోనూ నేను వాళ్లకి నోఅని చెప్పలేను. 25 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి నిర్మాతగా ఎన్నో సినిమాలు తెరకెక్కించాను. దర్శకుడిగా ఓ చిత్రాన్ని రూపొందించాలని ఎంతోకాలం నుంచి నాలో ఆశ ఉంది. కాబట్టి, తప్పకుండా దర్శకత్వంలోకి అడుగుపెడతాను. అంతేకాకుండా డైరెక్షన్‌కు ఇదే సరైన సమయంగా భావిస్తున్నా. త్వరలోనే పనిని ప్రారంభిస్తా. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో వాయిదా వేయకుండా మనకు ఏం చేయాలనిపిస్తే దానిని వీలైనంత త్వరగా చేయాలని అర్థమైంది’

‘చాలా సంవత్సరాల క్రితం యశ్‌ చోప్రా ‘లమ్హే’ చిత్రంలో ఓ కీలక పాత్రను ఆఫర్‌ చేశారు. శ్రీదేవి కథానాయిక. ఇందులో నేను ఆమె ప్రియుడిగా నటించాల్సి ఉంది. నా పాత్ర ఎలా ఉంటుందనే విషయం నాకు తెలీదు. కానీ, సినిమాతో శ్రీదేవికి కొంతైనా దగ్గర కావొచ్చనే ఉద్దేశంలో అప్పట్లో ఓకే చేశాను. ‘లమ్హే’ చిత్రీకరణ స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న సమయంలో అనుకోని కారణాల వల్ల నేను షూట్‌లో పాల్గొనలేకపోయాను. అలా నా స్థానంలోకి దీపక్‌ మల్హోత్ర వచ్చారు’ అని బోనీకపూర్‌ వివరించారు.

ఇవీ చదవండి

జ్వరంతో ఉన్నా.. చిరు నాకోసం ఎదురుచూశారు..!

సినిమా విడుదలయ్యే వరకూ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌!

ఈ మెగా డేట్స్‌ గుర్తుపెట్టుకోండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని