Ira Khan: ఆమిర్‌ఖాన్‌ కుమార్తె పెళ్లి వేడుకలు షురూ.. ఫొటోలు వైరల్‌

ఆమిర్‌ఖాన్‌ కుమార్తె ఐరాఖాన్‌ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. తాజాగా ఆమిర్‌ ఖాన్‌ నివాసంలో కెల్వన్ కార్యక్రమం జరిగింది.

Published : 08 Nov 2023 13:44 IST

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఆయన కుమార్తె ఐరా ఖాన్‌ (Ira Khan) - నుపుర్‌ వివాహం జనవరి 3న జరగనుంది. ఇందులో భాగంగా మంగళవారం ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. కాబోయే వధూవరుల కుటుంబాలు ఒకేచోట కలిసి కెల్వన్‌ కార్యక్రమం నిర్వహించాయి. దీనికి సంబంధించిన ఫొటోలను ఐరా తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ఇందులో వధూవరులిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం పెళ్లి పనులు కెల్వన్‌తో మొదలవుతాయి. ఇరు కుటుంబసభ్యులు విందు భోజనాలు ఏర్పాటు చేసి, కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. 

గత కొన్నేళ్ల నుంచి ఆమిర్‌ ఖాన్‌కు వ్యక్తిగత ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా నుపుర్‌ పనిచేస్తున్నాడు. దీంతో ఐరా సైతం నుపుర్‌ వద్ద ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్చుకుంది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ ఏర్పడింది. కొంతకాలానికి అది ప్రేమగా మారింది. 2020 నుంచే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. గతేడాది నవంబర్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. నుపుర్‌ తనని ఎంతగానో అర్థం చేసుకున్నాడని.. తాను డిప్రెషన్‌తో పోరాడుతున్న సమయంలో అతను అండగా నిలిచాడని ఐరా గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Allu Arjun: చెప్పు వదిలేసినా వైరలవ్వడం మొదటిసారి చూశా: శ్రీవల్లీ పాటపై అమితాబ్‌ కామెంట్స్‌

‘‘వాళ్ల మనసులు దగ్గరయ్యాయి. వాళ్ల పెళ్లి నాడు నేనెంతో భావోద్వేగానికి గురవుతా’’ అని ఆమిర్‌ ఇటీవల ఓ సందర్భంలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని