Kiara: నయా డాన్‌ సరసన కియారా?

‘డాన్‌’ అభిమానులు ఖుషీ అయ్యేలా నటుడు, దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌ ‘డాన్‌ 3’ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

Updated : 10 Aug 2023 14:03 IST

‘డాన్‌’ అభిమానులు ఖుషీ అయ్యేలా నటుడు, దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌ ‘డాన్‌ 3’ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇందులో రణ్‌వీర్‌సింగ్‌ డాన్‌గా కనిపించనున్నాడు. మరి ఆయన సరసన నటించేది ఎవరో అనే ఆసక్తి బాలీవుడ్‌ వర్గాల్లో కనిపిస్తోంది. తాజాగా ప్రముఖ కథానాయిక కియార అడ్వాణీ పేరు తెరపైకి వచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మించనున్న ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యాలయంలో కియారా కనిపించడంతో ఇది నిజమే అంటూ వార్తలు వస్తున్నాయి. ‘‘కియారాకు ఫర్హాన్‌ అక్తర్‌ చెప్పిన కథ ఆమెకు బాగా నచ్చింది. నటించడానికి ఆమె సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. రణ్‌వీర్‌సింగ్‌ సరసన నటించడం అంటే కియారాకు ఎంతో ఇష్టం’’అని సినిమా వర్గాలు చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రంలో కియారాది నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రని కూడా ప్రచారం జరుగుతోంది. కియారా ప్రస్తుతం తెలుగులో రామ్‌చరణ్‌ సరసన ‘గేమ్‌ ఛేంజర్‌’లో నటిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని