‘లేడీ సూపర్‌స్టార్ నన్ను ప్రశంసిందోచ్..! జాన్వీకపూర్ భావోద్వేగం
జాన్వీకపూర్ (Janhvi Kapoor) తాజా చిత్రం ‘గుడ్ లక్ జెర్రీ’ (Good Luck Jerry) డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney+ Hotstar)వేదికగా ప్రసారమవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: జాన్వీకపూర్ (Janhvi Kapoor) తాజా చిత్రం ‘గుడ్ లక్ జెర్రీ’ (Good Luck Jerry) డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney+ Hotstar)వేదికగా ప్రసారమవుతోంది. ఈ చిత్రం 2018లో వచ్చిన ‘కొలమావు కోకిల’(తెలుగులో ‘కోకో కోకిల’)అనే విజయవంతమైన తమిళ సినిమాకి రీమేక్. ‘కొలమావు కోకిల’లో ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార (Nayanthara) కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి జాన్వీ కపూర్ ఒక ఆసక్తికరమైన అంశాన్ని ప్రేక్షకులతో పంచుకుంది. తనకు ‘లేడీ సూపర్ స్టార్ ప్రశంస’ లభించిందంటూ భావోద్వేగం చెందింది.
ఒక ఇంటర్వ్యూలో ఈ అంశంపై జాన్వీకపూర్ మాట్లాడుతూ.. ‘గుడ్ లక్ జెర్రీ సినిమాపై నయనతార సానుకూలంగా స్పందించారని చదివా. ఆమె ఫోన్ నంబరు తెలుసుకుని సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెకు మెసేజ్ పంపాను. దానికి లేడీ సూపర్‌స్టార్ నుంచి రిప్లై వచ్చింది. ‘కెరీర్ ప్రారంభంలోనే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రను నువ్వు పోషించినందుకు గర్విస్తున్నా. అభినందనలు’ అంటూ నయనతార రిప్లై ఇచ్చారని జాన్వీ వెల్లడించింది. ‘అంత పెద్ద నటి అభినందించడం నాకు బాగా నచ్చింది. ఈ ప్రశంస నాకు ప్రత్యేకమైంద’ని జాన్వీ భావోద్వేగం చెందింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ మద్యం కేసులో అప్రూవర్లుగా మాగుంట రాఘవ్, దినేష్ అరోరా
-
RK Roja: తెదేపాను వీడినప్పటి నుంచి కక్ష కట్టారు: మంత్రి రోజా
-
YS Jagan: రేపు దిల్లీకి సీఎం జగన్.. హఠాత్తుగా సామర్లకోట పర్యటన వాయిదా
-
స్నేహితులను వరించిన అదృష్టం.. లాటరీలో రూ.కోటిన్నర గెలుపు
-
Engineering Counselling: ఏపీలో ఇంజినీరింగ్‌లో మూడో విడత కౌన్సెలింగ్ ఎత్తివేత
-
Guntur: సహజీవనం నేపథ్యంలో వివాదం.. యువకుడిపై మహిళ యాసిడ్ దాడి