KGF2: ‘కేజీఎఫ్‌-2’లో ఐటమ్‌ సాంగ్‌గా షోలే- ‘మెహబూబా మెహబూబా’?

భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ఇండియా చిత్రం ‘కేజీఎఫ్‌-2’. ఈ చిత్రం కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా నటించిన ‘కేజీఎఫ్-1‌’కు కొనసాగింపుగా రానుంది. బాలీవుడ్‌ తారలు సంజయ్‌ దత్‌, రవీనా టండన్‌ ఈ చిత్రానికి ఆకర్షణగా నిలువనున్నారు.

Updated : 14 Feb 2022 15:55 IST

యశ్‌ సరసన ఆడిపాడిన బాలీవుడ్‌ హీరోయిన్‌?

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ఇండియా చిత్రం ‘కేజీయఫ్‌-2’. ఈ చిత్రం కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా నటించిన ‘కేజీయఫ్-1‌’కు కొనసాగింపుగా రానుంది. బాలీవుడ్‌ తారలు సంజయ్‌ దత్‌, రవీనా టండన్‌ ఈ చిత్రానికి ఆకర్షణగా నిలువనున్నారు. తాజాగా ఈ సినిమా ఐటమ్‌సాంగ్‌కు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్‌ వినిపిస్తోంది. బాలీవుడ్‌ నటి నోరా ఫతేహి.. హీరో యశ్‌ సరసన నర్తించినట్లు సమాచారం. ‘కేజీయఫ్‌-1‌’లోని స్పెషల్‌ సాంగ్‌ కోసం 1989లో విడుదలైన జాకీ ష్రాఫ్‌ చిత్రం ‘త్రిదేవ్‌’లోని ‘గలీ గలీ మేన్‌ ఫిర్తా పాటను రీమేక్‌ చేశారు. బాలీవుడ్‌ భామ మౌనీరాయ్‌ అందులో ఆడిపాడింది. ఇప్పుడు ఐటమ్‌సాంగ్‌ విషయంలో ‘కేజీయఫ్‌-2’లోనూ అదే సీన్‌ను రిపీట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. 1975లో విడుదలైన అమితాబ్‌ సూపర్‌ హిట్‌ క్లాసిక్‌ చిత్రం ‘షోలే’లోని ‘మెహబూబా.. మెహబూబా’ పాటను రీమేక్‌ చేస్తున్నారట. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సాంగ్‌ను విడుదల చేయనున్నారట. ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా చిత్రం ఏప్రిల్‌ 14న థియేటర్లలో సందడిచేయనుంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని