Mahabharat: ‘మహాభారత్‌’ నటుడు కన్నుమూత

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు గుఫీ పైంతాల్‌ కన్నుమూశారు.

Published : 05 Jun 2023 15:06 IST

ముంబయి: ‘మహాభారత్‌’ ధారావాహికతో శకుని మామగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు గుఫీ పైంతాల్‌ (78) సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యతో ఇబ్బందిపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని కుటుంబసభ్యులు వెల్లడించారు.

గుఫీ పైంతాల్‌ అసలు పేరు సరబ్జిత్ సింగ్ పైంతాల్‌. నటుడు కావడానికంటే ముందు ఆయన ఆర్మీలో పనిచేశారు. బాలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు, సీరియల్స్‌లో ఆయన నటించారు. ‘మహాభారత్‌’ సీరియల్‌ ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘జై కన్నయ్య లాల్‌ కీ’లో ఆయన చివరిగా పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు