Mrunal Thakur: అలాంటి సినిమాల్లోనే భాగంకావాలనుకున్నా..: మృణాల్‌ ఠాకూర్‌

‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు విశేషాలు పంచుకున్నారు.

Published : 09 Nov 2023 02:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకునే చిత్రాల్లోనే భాగమవ్వాలనుకున్నానని హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) తెలిపారు. తన కొత్త సినిమా ‘ఆంఖ్‌ మిచోలీ’ (Aankh Micholi) ప్రచారంలో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘నేను నటించిన ‘సీతారామం’ సినిమా పిల్లలకు కూడా బాగా నచ్చింది. తెలుగులోనే కాదు హిందీ చలన చిత్ర పరిశ్రమలోనూ ఆ చిత్రం నాకెంతో గుర్తింపు తీసుకొచ్చింది. ఉత్తరాది ప్రేక్షకులూ నాపై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి రొమాంటిక్ మూవీస్‌ మరిన్ని కావాలని నన్ను కోరారు. అయితే, ప్రస్తుత సినిమాల్లో రొమాన్స్‌, కామెడీ అంశాలు మిస్‌ అవుతున్నాయనేది నా అభిప్రాయం. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే సినిమాల్లోనే భాగంకావాలని అనుకున్నా. ‘ఆంఖ్‌ మిచోలీ’, ‘హాయ్‌ నాన్న’, ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రాలు అలాంటివే. కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమాలివి’’ అని అన్నారు. ‘బాహుబలి: బిఫోర్‌ ది బిగినింగ్‌’ వెబ్‌సిరీస్‌లో తాను నటించాల్సింది గానీ అనివార్య కారణాల వల్ల కుదుర్లేదని తెలిపారు.

మౌనంగా ఉండే సమయం కాదిది

పరేశ్‌ రావల్‌, అభిమన్యు, మృణాల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆంఖ్‌ మిచోలీ’ సినిమాకి ఉమేశ్‌ శుక్లా దర్శకత్వం వహించారు. ఈ నెల 3న విడుదలైంది. మృణాల్‌ ‘సీతారామం’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నాని (Nani) సరసన ఆమె నటించిన ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) డిసెంబరు 7న, విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda)తో కలిసి నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు రానున్నాయి. ఆమె కీలక పాత్ర పోషించిన ‘పిప్పా’ (Pippa) ఈ నెల 10న నేరుగా ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు