మే మూడోవారంలో ఓటీటీలో ‘వైల్డ్ డాగ్’ విడుదల?
నాగార్జున కథానాయకుడిగా అహిషోర్ సాల్మాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. ఈ సినిమా ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: నాగార్జున కథానాయకుడిగా అహిషోర్ సాల్మాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. ఈ సినిమా ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఇప్పటికే హక్కులు పొందినట్లు వార్తలొస్తున్నాయి. మే మూడోవారంలో డిజిటల్ మీడియాలో విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున ఇందులో ఎన్ఐఏ ఏజెంట్ విజయ్ వర్మగా కనిపించగా సయామీఖేర్ రా ఏజెంట్‌గా నటించింది. దియా మీర్జా, అతుల్ కుల్కర్ణి, అలీ రెజా, అనీష్ కురువిళ్ల, ప్రకాష్ సుదర్శన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంరజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. షానైల్ డియో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయగా శ్రావణ్ కటికనేని ఎడిటర్‌గా పనిచేశారు. కిరణ్ కుమార్ డైలాగ్స్ రాశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి