నిధి అగర్వాల్‌ దశ మారనుందా?

ఇస్మార్ట్‌ భామ నిధి అగర్వాల్‌ లక్‌ మారనుందా?అంటే అవుననే అందరూ మాట్లాడుకుంటున్నారు. ‘సవ్యసాచి’, ‘మిస్టర్‌.మజ్ను’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి క్లాస్‌, మాస్‌ చిత్రాల్లో నటించిప్పటికీ తెలుగులో ఆమెకు అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు.

Published : 28 Jan 2021 13:48 IST

నెట్టింట్లో వరుస కథనాలు

హైదరాబాద్‌: ఇస్మార్ట్‌ భామ నిధి అగర్వాల్‌ లక్‌ మారనుందా?అంటే అవుననే అందరూ మాట్లాడుకుంటున్నారు. ‘సవ్యసాచి’, ‘మిస్టర్‌.మజ్ను’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి క్లాస్‌, మాస్‌ చిత్రాల్లో నటించిప్పటికీ తెలుగులో ఆమెకు అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్‌పై దృష్టిపెట్టింది. ఇటీవల విడుదలైన ‘భూమి’, ‘ఈశ్వరన్‌’ మినహా అక్కడా ప్రాజెక్ట్‌లు దొరకలేదు.

కాగా, తాజా సమాచారం ప్రకారం.. నిధి అగర్వాల్‌ ఓ బంపర్‌ ఆఫర్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ డ్రామాలో కథానాయికగా నటించే అవకాశాన్ని ఈ నటి దక్కించుకున్నట్లు గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇదే వార్తలు మరోసారి నెట్టింట్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే ఆమె షూట్‌లో పాల్గొందని.. సంక్రాంతి తర్వాత కొన్నిరోజులకే ఆ షెడ్యూల్‌  పూర్తి అయ్యిందని నెట్టింట్లో వరుస కథనాలు దర్శనమిస్తున్నాయి. దీంతో సదరు వార్తలపై నెటిజన్ల ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ, ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదీ చదవండి

మహేశ్‌.. బన్నీ.. సినిమాల్లో ఊర్వశి స్టెప్పులు!

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు