NTR: ఎన్టీఆర్‌ మరో ఘనత

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్‌ మరో ఘనత అందుకున్నారు. ఈ ఏడాది ఆసియాలో టాప్‌ 50లో నిలిచిన నటుల జాబితాను  ఏషియన్‌ వీక్లీ మ్యాగజైన్‌ ‘ఈస్టర్న్‌ ఐ 2023’ పేరుతో ప్రకటించింది.

Updated : 23 Dec 2023 09:30 IST

ర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్‌ మరో ఘనత అందుకున్నారు. ఈ ఏడాది ఆసియాలో టాప్‌ 50లో నిలిచిన నటుల జాబితాను  ఏషియన్‌ వీక్లీ మ్యాగజైన్‌ ‘ఈస్టర్న్‌ ఐ 2023’ పేరుతో ప్రకటించింది. ఆ జాబితాలో తారక్‌ 25వ స్థానంలో నిలిచారు. ఇలా ఈ జాబితాలో తెలుగు చిత్రసీమ నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక హీరో ఎన్టీఆర్‌ కావడం విశేషం.  ఇక ఈ జాబితాలో బాలీవుడ్‌ కథానాయకుడు షారుక్‌ ఖాన్‌ తొలిస్థానంలో నిలిచారు. ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర గ్లింప్స్‌ నూతన సంవత్సర కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం అందుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని